నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: బలరాం

ప్రజాశక్తి-చీరాల: ప్రజల సమస్యల పరిష్కరిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతానని తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బుధవారం నియోజక వర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబుతో కలిసి సుడిగాలి పర్యటన చేస్తూ ప్రారంభోత్సవాలు చేశారు. మునిసిపాలిటీ పరిధిలో మసీదు సెంటర్‌లో 90 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌, శ్లాబు కల్వర్టు, మురుగునీటి కాలువలు, అభివృద్ధి పరచిన సిమెంట్‌ రోడ్డు విస్తరణ పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా కొత్తపేట పంచాయతీలో 43 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కుందేరు దగ్గర పార్కు ప్రారంభోత్సవం, 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం, 20 లక్షల రూపాయలతో ఆధునికరించిన జిల్లా ప్రజా పరిషత్‌ అతిథి గృహం, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ భవనం ప్రారంభోత్సవం మరియు కొత్తపేట పంచాయతీ 11 కోట్ల 99 లక్షల రూపాయలతో ఈ ఐదు సంవసంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. వాడరేవు రోడ్డులోని కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. రామకృష్ణాపురం పంచాయతీ కార్యాలయం భవనంపై రూ.9 లక్షలతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, డాక్టర్‌ వరికూటి అమృతపాణి, డాక్టర్‌ బాబురావు, రాష్ట్ర మహిళ జాయింట్‌ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్‌, మునిసిపల్‌ డిఈ ఐసయ్య, ఏఈ కట్టా రవి, పంచాయితీరాజ్‌ డిఈ శేషయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్‌బాబు, ఎం కిరణ్‌ కుమార్‌, పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళ జాయింట్‌ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్‌, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు చీమకుర్తి బాల కృష్ణ, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు సల్లూరి అనిల్‌, సర్పంచ్‌ కందేటి రమణ, ఉప సర్పంచ్‌ దంతం వెంకట సుబ్బారావు, బెంజిమన్‌, ఆవుల కొండలు, పొద ప్రసాద్‌, షేక్‌ హౌలీ, జనరల్‌ సెక్రటరీ చిలుకోటి శ్రీనివాసరావు, సచివాలయం సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️