నిరవధిక సమ్మెపై అంగన్‌వాడీల వినతి

Dec 6,2023 21:26
తహశీల్దార్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం ఇస్తున్న యూనియన్‌ నేతలు

నిరవధిక సమ్మెపై అంగన్‌వాడీల వినతిప్రజాశక్తి – బాలాయపల్లి అంగన్‌వాడి సిబ్బందికి వేతనాలు పెంచాలని శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నామని తహశీల్దార్‌ శ్రీనివాసులుకు అంగనవాడి జిల్లా సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2022లో సుప్రీంకోర్టు అంగన్‌ వాడిలకు గ్రాట్యూటి అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికీ మన రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. అంగనవాడి మినీ సెంటర్‌ లను మెయిన్‌ సెంట్రల్‌ గా మార్చలేదన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదని చెప్పారు అంగనవాడిల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా అనేక రకాలుగా చేసిన ఆందోళనపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధ ప్రయోగం చేస్తుందని మండిపడ్డారు. ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడి సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరవధిక సమ్మెను ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు ఏ మంజుల, సుమతి, అంగనవాడి ఆయాలు సుజాత, వెంకటమ్మ, సిఐటియు నాయకులు వడ్డీపల్లి చెంగయ్య ఉన్నారుతహశీల్దార్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం ఇస్తున్న యూనియన్‌ నేతలు

➡️