‘నారాయణ’లో ఫాస్ట్‌ట్రాక్‌ అత్యవసర సేవలు ప్రారంభం

Jun 17,2024 20:25
'నారాయణ'లో ఫాస్ట్‌ట్రాక్‌ అత్యవసర సేవలు ప్రారంభం

మాట్లాడుతున్న వైద్యులు
‘నారాయణ’లో ఫాస్ట్‌ట్రాక్‌ అత్యవసర సేవలు ప్రారంభం
ప్రజాశక్తి-నెల్లూరు :నారాయణ మెడికల్‌ కళాశాల హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ”ఫాస్ట్‌ట్రాక్‌” ఎమర్జెన్సీ సేవలను ప్రారంభించినట్లు ఆ వైద్యశాల అడిషనల్‌ మెడికల్‌ సూపరింటిండెంట్‌ డాక్టరు ఆర్‌. హరీష్‌ పేర్కొన్నారు. సోమవారం నారాయణ వైద్యశాలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ”ఫాస్ట్ట్రాక్‌” ఎమర్జెన్సీ సేవలను నారాయణ హాస్పిటల్‌ అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌. హరీష్‌, ఆపరేషన్స్‌ హెడ్‌ రామారావు ముఖ్య అతిధులుగా విచ్చేసి ప్రారంభించారు. నారాయణ హాస్పిటల్‌ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టరు ఎస్‌. గోపాల్‌ మాట్లాడుతూ గత రెండు దశాబ్ధాలుగా నారాయణ ఆసత్ర్రిలో ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ ఎమర్జెన్సీ సేవలను అందు బాటులోకి తీసుకొచ్చామన్నారు. అత్యవసర పరిస్థితులలో 24/7 రోగులకు వేగంగా వైద్య సాయం అందించేందుకు ఈ ఫాస్ట్ట్రాక్‌ ఎమర్జెన్సీ సేవలు ఎంతో కీలక పాత్ర పోషిస్తా యన్నారు. అనంతరం ఆపరేషన్స్‌ హెడ్‌ రామారావు మాట్లాడుతూ అత్యవసర సమ యంలో చేయాల్సిన అత్యవసర సేవలు సమర్ధవంతంగా ఉన్నపుడే మెరుగైన వైద్య చికిత్సలు అందించవచ్చున్నారు. నారాయణ హాస్పిటల్‌ లోని అత్యవసర సేవల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9037104108 ఫోన్‌ నంబరును 24/7 సంప్రదించవచ్చునని హాస్పిటల్‌ ఏజీఎం ఎ.సి శేఖర్‌ రెడ్డి తెలిపారు. నారాయణ హాస్పిటల్‌ అడినల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డావ ఆర్‌. హరీష్‌ ఉన్నారు.

➡️