బారాషాహిద్‌ దర్గా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Jun 17,2024 20:27
బారాషాహిద్‌ దర్గా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ప్రార్థనలు చేస్తున్న మంత్రులు
బారాషాహిద్‌ దర్గా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ప్రజాశక్తి-నెల్లూరుఎంతో ఘన చరిత్ర గల బారాషహిద్‌ దర్గా అభివద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణ అభివద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సోమవారం బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి మంత్రి నారాయణ బారాషహీద్‌ దర్గాను సందర్శించారు. దర్గాకు విచ్చేసిన ఎంపి మంత్రులకు ముస్లిం మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపి, మంత్రులు ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు తమ ప్రభుత్వ హయాంలో బారాషహీద్‌ దర్గా అభివద్ధికి ఎంతో కషి చేశామని గుర్తు చేశారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్‌ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అందరి సహకారంతో పక్కా ప్రణాళికలు రూపొందించుకొని భవిష్యత్తులో బారాషహిద్‌ దర్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌, స్థానిక నాయకులు అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం రంగమయూర్‌ రెడ్డి ఉన్నారు.

➡️