నిరాశే

Feb 7,2024 20:30 #నిరాశే

ప్రజాశక్తి – కడప ప్రతినిధి2024-25 ఓటాన్‌ బడ్జెట్‌ తీవ్ర నిరా శను కలిగించింది. జిల్లా ప్రగతికి కీలక రంగాలైన నీటి పారుదల, వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగాల పురోభివృద్ధికి అవసరమైన కేటాయింపుల్లో స్పష్టత కొరవడింది. జిల్లా జీవనాడిగా పరిగణ పొందిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, దాని పురోగతికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం విస్మయాన్ని కలి గించింది. వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ క్టస్టర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన విస్మరిం చింది. వ్యవసాయం, సాగునీటిపారుదల, పారిశ్రామిక రంగాలకు మూడు, నాలుగు నెలల వ్యయానికి సంబం ధించిన కీలక రంగాలకు చేయా ల్సిన వ్యయాల్ని సైతం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బుధవారం రూ.2,86,389 కోట్లతో 2024-25 ఓటాన్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జిల్లాకు సంబంధించిన కేటాయింపులను పరిశీలిస్తే తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. సాగునీటిరంగ కేటాయింపుల ప్రస్తావన సైతం చేయలేదు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో ముడిపడిన జిఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌, కెసికెనాల్‌ కేటాయింపులు చేయకపోవడం ఆందోళన కలిగించింది. మూడు, నాలుగు నెలల స్వల్పకాలిక ఓటాన్‌ బడ్జెటే అయినప్పటికీ ప్రాధాన్య, ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రస్తావన లేదు. గత బడ్జెట్‌లో జిఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.855.35 కోట్లు, పిబిసికి రూ.106.59 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌కు రూ.122.69 కోట్లు, వెలిగల్లుకు రూ.1.5 కోట్లు, చెయ్యేరుకు రూ.20 లక్షలు కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. 2023-24 బడ్జెట్‌లో రూ.1542.17 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏమేరకు కేటాయించారనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. గత బడ్జెట్‌లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ.2,200 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో ఉక్కు పరిశ్రమ ప్రస్తావనే చేయలేదు. గతేడాది వైఎస్‌ఆర్‌ మాన్యుఫ్యాక్షరింగ్‌ క్లస్టర్‌లో ఆల్‌డిక్సన్‌ పరిశ్రమ ప్రారంభోత్సవం సమయంలో కుదర్చుకున్న రూ.450 కోట్లతో ఎంఒయును ప్రస్తావించడంతో సరిపెట్టింది. గత బడ్జెట్‌లో పులివెందుల అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ, పులివెందుల్లో వెటర్నరీ బయోలాజికల్‌ ఇన్సిట్యూట్‌లో ముర్రాజాతి గెదేల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. యోగి వేమన యూని వర్శిటీకి రూ.32.83 కోట్లు, సిపిబ్రౌన్‌కు రూ.10 లక్షలు, చొప్పున కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్‌లో ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ ఏర్పాట్లు చేస్తున్నామనే పాత ప్రస్తావనను వల్లెవేశారు. ఉమ్మడి జిల్లాలోని 4.80 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్లతో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, రూ.1835 కోట్లతో సున్నా వడ్డీ పథకం కింద లబ్ధి పొందనున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్నమయ్య, పింఛా, ఎల్‌ఎస్‌పి, కుందూ-పెన్నా, కాలేటివాగు ఎత్తిపోతల పథకాల పనులకు సంబంధించిన కేటాయింపుల ప్రస్తావన చేయలేదు.

➡️