నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి నిరంకుశ నిర్బంధాలతో సమ్మెను ప్రభుత్వం ఆపలేదని సిఐటియు జిల్లా ట్రెజరర్‌ హరీశర్మ పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లి మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన 37వ రోజుకు సమ్మె చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఐక్యంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు మొదలుపెట్టాయన్నారు. ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని అంగన్వాడీలు తప్పుక విజయం సాధిస్తారని మనోస్థర్యం కోల్పోకుండా ఉద్యమాన్ని మరింత ఉధతంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. సమ్మె ప్రారంభం నుండి ప్రభుత్వం పైన నాలుగు విజయాలు సాధించామని చెప్పారు. సమ్మె నోటీసు ఇచ్చిన రోజు నుండి ప్రభుత్వం అంగన్వాడీలపై అస్మా ప్రయోగిస్తామని, ఉద్యోగులు తొలగిస్తామని జిల్లా కలెక్టర్లతో నోటీసులు ఇచ్చి వైఫల్యం చెందిందని తెలిపారు. సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, తహశీల్దారు అంగన్వాడీ సెంటర్‌ తాళాలు పగలగొట్టి పని చేయిస్తామని చెప్పి వారు సాధించింది ఏమీలేదని పేర్కొన్నారు. సెంటర్లలో ఉయ్యాలలూగుతూ సెల్‌ ఫోన్లో వీడియోలు చూస్తూ వారు చేసింది ఏమీ లేదు కాలయాపన చేశారన్నారు. గుడ్డి ప్రభుత్వానికి కుంటి ప్రభుత్వానికి చెవిటి ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలు పట్టడం లేదని తెలిపారు. దళితులు, బీసీలు, మైనార్టీలు నా బంధువులు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పే ముఖ్యమంత్రి సంక్రాంతి పండగ రోజు సెట్టింగ్‌కు రూ.కోట్లు ఖర్చు పెట్టారన్నారు. సామాన్యుల సమస్యలు ఆయన కట్టడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సుకుమారి, కార్యదర్శి ఓబులమ్మ సెక్టార్‌ లీడర్లు రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి ఐసిడిఎస్‌ కార్యాలయం సమీపంలో నిరాహార దీక్షలు చేపట్టారు కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌, సిఐటియు అనుబంధం, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మీ, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి, అధ్యక్షులు, శ్రీరమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాధా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మావతి, వెన్నెల, దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు జాన్‌ ప్రసాద్‌,ఏఐటీయూసీ నాయకులు సరోజ నిర్మల నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️