నూతలపాడులో పోలీసుల కవాతు

ప్రజాశక్తి-పర్చూరు: మండల పరిధిలోని నూతలపాడులో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం బిఎస్‌ఎఫ్‌ దళాలతో కలిసి పలు గ్రామాల్లో కవాతు నిర్వహించినట్లు సీఐ సీతారామయ్య తెలిపారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజల్లో ముందుగా ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు పట్టణంలో కవాతు నిర్వహించినట్లు పోలీసులు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️