నేటి నుంచి ‘పది’ పరీక్షలు

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుపరీక్షా కేంద్రాలను ‘నో ఫోన్‌ జోన్‌’ ప్రకటనహాజరు కానున్న 27,858 మంది విద్యార్థులుప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో పదవత తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న 581 పాఠశాలల నుంచి 27,858 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 14,269 మంది అబ్బాయిలు, 13,589 మంది అమ్మాయిలు ఉన్నారు. ఉదయం 9,30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలి. పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు 153 పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు 1,320 మంది ఇన్విజిలేటర్స్‌నుచ 153 మంది సిట్టింగ్‌ స్వ్వాడ్స్‌ను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాలను ‘నో ఫోన్‌ జోన్‌’గా ప్రకటించారు. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. కేంద్రాలలో మౌలిక వసతుల బాధ్యత ఎంఇఒలకు అప్పగించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేశారు. 7 ప్లైయింగ్‌ స్వ్కాడ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలోకి ఎలాంటి ఎలాక్ట్రానిక్‌ పరికరాలును అనుమతించారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్‌ సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక కేంద్రాలలో అదనపు సిట్టింగ్‌ స్వ్కాడ్స్‌, సిసి కెమెరానలు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రశ్నాపత్రానికి క్వూఆర్‌ కోడ్‌ ఇచ్చారు. ప్రశ్నాపత్రాన్ని ఏ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరీక్ష నిర్వాహకులందరికి ఐడి కార్ట్స్‌ ఇచ్చారు. పరీక్షలకు సంబంధించి సందేహాలు నివృత్తి చేయుటకు డిఇఒ కార్యాలయంలో 9573133385 నంబరతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

➡️