నేతాజీ ఆశయాలతో యువత ‘ఉక్కు’ కోసం ఉద్యమించాలి

ప్రజాశక్తి-కడప అర్బన్‌/కడప స్వాతంత్య్ర సమరయోధుడు, మరణం లేని మహనీయుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆశయ సాధనలో కడప ఉక్కు కోసం యువత ఉద్యమి ంచా లని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులు తెలిపారు. నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యాల యంలో నేతాజీ చిత్రపటానికి నివాళి అర్పి ంచారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్‌, ఎస్‌ ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గండి.సునీల్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సగిలి.రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీది చెరగని ముద్ర అన్నారు. యువతకు ఆదర్శమూర్తి అన్నారు.నాడు యువతకు స్వాతంత్య్ర పోరాటంలో నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానని ఉవ్వెత్తున ఉత్తేజాన్ని ఇచ్చి పోరాటాలలో యువతను భాగస్వామ్యం చేశాడు అన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌. షాకీర్‌, డి.ఎం.ఓబులేసు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌ అధ్యక్షతన, పార్టీ నగర అధ్యక్షులు విష్ణు ప్రీతంరెడ్డి ఆధ్వర్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివా ళులర్పిం చారు. కార్యక్ర మంలో కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్ల య్య, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామలాదేవి, జిల్లా సెక్రెటరీ పి. నాగరాణి, బీసీ చైర్మన్‌ కుల్లయప్ప, జిల్లా యూత్‌ ఉపాధ్యక్షులు మధు రెడ్డి, మైనార్టీ నాయ కులు అబ్దుల్‌ , హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా జిల్లా అధ్యక్షులు పాలగిరి శివ, ప్రసన్న, డబ్బు చంద్ర, రఫీక్‌, అఖిల్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. ఆర్ట్స్‌ కళాశాలలో.. దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కీలక పాత్ర పోషించారని కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయం ప్రతిపత్తి) ప్రిన్సి పల్‌ డాక్టర్‌ జి. రవీంద్రనాథ్‌ అన్నారు. మంగళవారం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ అంకాల నాగరాజు ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ 127వ జయంతి ఉత్సవం పరాక్రమ్‌ దివస్‌ ను ఘనంగా నిర్వహించారు. చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ లు శివరామకష్ణ, డాక్టర్‌ లీలా వర్ధిని, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమేష్‌, చరిత్ర అధ్యాపకురాలు శ శివ పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️