నేర నియంత్రణకు సిసి కెమెరాలు కీలకం

సిసి కెమెరాలు

ప్రజాశక్తి -తగరపువలస : నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు నిఘా ఎంతో కీలకమని భీమిలి సిఐ డి.రమేష్‌ స్పష్టం చేశారు. గురువారం బాలాజీనగర్‌, చిట్టివలస, పెరికివీధి ప్రాంతాల్లో సిసి కెమెరాల ఆవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సులువుగా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుని, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు సిసి కెమెరాల ఫుటేజీ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు

బాలాజీనగర్‌లో అవగాహన కల్పిస్తున్న సిఐ రమేష్‌

➡️