నోటి శుభ్రతపై అవగాహన ర్యాలీ

Mar 20,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఈనెల 20 నుంచి జరుగుతున్న నోటి శుభ్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20నుంచి వచ్చేనెల 20వరకు జరుగుతున్న నోటిశుభ్రతా మాసోత్సవాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి, సచివాలయాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు పాఠశాలలకు వెళ్లి నోటి శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నోటి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ మొదలైన వాటిపై డెమో ఇవ్వాలని తెలిపారు. బ్రష్‌ చేసేటప్పుడు 2 నుంచి 3 నిముషాలు మాత్రమే చేయాలని, ఉదయం, రాత్రి భోజన అనంతరం రెండు దపాలు బ్రష్‌ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ పి.రవికుమారి, డెమో సిబ్బంది, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

➡️