నోటి శుభ్రతే ఆరోగ్య భద్రత

Mar 20,2024 21:41

 ప్రజాశక్తి-జియ్యమ్మవలస : నోటి శుభ్రతతోనే ఆరోగ్య భద్రత సాధ్యమని డెంటిస్ట్‌ రమ్య తెలిపారు. మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్‌ ఓరల్‌ డే సందర్భంగా డాక్టర్‌ రమ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి నోటి ఆరోగ్యం చాలా అవసరమన్నారు. నోటిలో ఉండే బ్యాక్టీరియా రక్తంలో చేరినప్పుడు గుండెతోపాటు అనేక ఇతర సమస్యలు వస్తాయన్నారు. దంతాలు చిగుళ్ళు పరిశుభ్రంగా లేకుంటే కేన్సర్‌ వంటి రోగాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ రూపంపై ఉన్న శ్రద్ధ దంతాలపై పెట్టకపోవడంతో నేడు అనేక నోటి సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రతిరోజూ రెండు పూటలా నోటిని పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ టి.కె.సునీల్‌ కుమార్‌, డాక్టర్‌ అనిల్‌ చైతన్య, కె.చంద్రవర్మ, హెడ్‌ నర్స్‌ కె.పార్వతి, సిబ్బంది పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : నోటి శుభ్రతతోనే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వాగ్దేవి అన్నారు. బుధవారం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది నిర్వహించిన ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు ఆసుపత్రికి చెందిన దంత వైద్యులు ఎం.దినేష్‌, ఆర్‌.శ్యామల, కె.సౌజన్య కూడా దీని ప్రాముఖ్యత గురించి నొక్కిచెప్పారు.

➡️