నోటీసుల పేరుతో బెదిరింపులకు గురిచేసినా.. సమ్మె ఆగదు : అన్నపూర్ణ

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌ : నోటీసుల పేరుతో బెదిరింపులకు గురిచేసినా అంగన్‌వాడీల సమ్మె ఆగదని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పశ్చిమ ప్రాంత అంగన్‌వాడీల ప్రాజెక్టు యూనియన్‌ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈదర అన్నపూర్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం రాష్టవ్యాప్తంగా అంగన్‌వాడీలు 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. షోకాజు నోటీసుల పేరుతో సమ్మెను విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే కోటి సంతకాలతో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం. రఫీ, జిల్లా ఉపాధ్యక్షుడు ఆవులయ్య,పి.రూబెన్‌. అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు సరళ ,ప్రభావతి, రమ, మల్లేశ్వరి, సుభాషిని, అరుణకుమారి, శ్రీలత కాశిశ్వరి ,మేరి పాల్గొన్నారు.

➡️