న్యాయవాదుల సంఘ అధ్యక్షునిగా సూరిదేముడు

Mar 28,2024 20:54

ప్రజాశక్తి- శృంగవరపుకోట: ఎస్‌కోట న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా జి.సూరిదేముడు ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మండా కామేశ్వరరావుపై జి.సూరిదేముడు 24ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారి మామిడి చంద్రశేఖర్‌, సహాయ ఎన్నికల అధికారి బొబ్బిలి రామకృష్ణ వెల్లడించారు. న్యాయవాదుల సంఘంలో రిజిస్ట్రేషన్‌ అయిన 45 మందికి గాను ఓటింగ్‌లో 42 మంది పాల్గొనగా ఇందులో జి.సూరిదేముడుకి 33 ఓట్లు, మండా కామేశ్వరరావుకి 9 ఓట్లు పోలయ్యాయి. కార్యదర్శిగా బి.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా ఎం.అప్పారావు, సంయుక్త కార్యదర్శిగా ఎల్‌.అప్పారావు, కోశాధికారిగా బి.త్రిమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి మామిడి చంద్రశేఖర్‌ ప్రకటించారు. అనం తరం అధ్యక్షుడిగా ఎన్నికైన జి.సూరిదేముడు అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో మాట్లాడుతూ మీడియా సెక్రట రీగా డబ్ల్యు.ఎన్‌.శర్మ, లైబ్రేరియన్‌ సెక్రటరీగా ఆర్‌.సత్య నారాయణ, కార్యవర్గ సభ్యులుగా బొడబళ్ల రామకృష్ణ, ఎన్‌. సత్యనారాయణ, జి.చిట్టిబాబు, జి.కోమల ప్రవీణ్‌, బి.వెంకట రావులను ఎన్నుకున్నట్లు తెలిపారు. బొండపల్లి: గజపతినగరం న్యాయవాదుల సంఘం అద్యక్షునిగా బిట్రా సూర్యారావు ఎన్నికయ్యారు. గురువారం న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షునిగా రాపాక సాయి సురేష్‌, కార్యదర్శిగా పొట్నూరు శ్రీను, కోశాధి కారిగా లెంక రాంబాబులు ఎన్నిక కాగా సంయుక్త కార్యదర్శిగా జెర్రిపోతుల జగదీశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సీనియర్‌ న్యాయవాది ఉప్పలపాటి రమేష్‌ వ్యవహరించారు.

➡️