న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Mar 7,2024 21:02

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి

సభకు హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది
ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.లీలావతి అధ్యక్షత వహించి మాట్లాడారు. 2024వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముక్యత, తీర్మానించిన లక్ష్యం మహిళల్లో పెట్టుబడి పెట్టడం, వేగవంతం చేయడం గురించి వివరించారు. మహిళలు స్వశక్తితో అభివద్ధి చెందాలని కుటుంబంలో మహిళల యొక్క ప్రాముఖ్యతను, సమాజంలో మహిళలపై గల ప్రస్తుత పరిస్థితుల యొక్క ప్రభావాన్ని గురించి వివరించారు. రెండవ అదనపు జిల్లా జడ్జి, గుంటూరు వి.ఎ.ఎల్‌.సత్యవతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. మూడవ అదనపు జిల్లా జడ్జి, గుంటూరు జి.అర్చన మాట్లాడుతూ 1911వ సంవత్సరం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, మహిళలందరూ అన్ని రంగాలలో ఇంకా అభివద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఐదవ అదనపు జిల్లా జడ్జి, గుంటూరు కె.నీలిమ మాట్లాడుతూ మహిళా సాధికారతకు పురుషుల సహకారం ఉందని, ప్రభుత్వం కూడా మహిళలు, పిల్లల పురోభివద్ధికి కషి చేస్తున్నాయని అన్నారు. సమాజంలో కుటుంబంలో మహిళలు నిర్వహిస్తున్న ప్రాముఖ్యతను ఇంకా పెంచుకోవలసిన శక్తి సామర్ధ్యాల గురించి వివరించారు. మహిళా న్యాయవాది ఎస్‌.బి.ఎ.ఝాన్సి మాట్లాడుతూ మహిళల సామర్ధ్యాన్ని పురుషులు కూడా గుర్తించి అన్ని రంగాల్లో వారికి సహాయ సహకారాలు అందిస్తునారని, ఏ రంగంలోనైనా స్త్రీలు తమ సామర్ధ్యాన్ని చాటగలరని అన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి. పార్ధసారధి, అదనపు జిల్లా జడ్జీలు సిహెచ్‌ రాజగోపాలరావు, ఆర్‌.శరత్‌బాబు, కె.సీతారామకృష్ణారావు, న్యాయమూర్తులు ఎ.అనిత, ఎం.కౌముదిని, పి.బుజ్జి, జి.స్పందన, మహిళా న్యాయవాది ఝాన్సీ, కోర్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️