పంగనామాలతో నిరసన

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 33వ రోజుకు చేరుకుంది. వై ఎస్‌ఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. పంగనామాలు పెట్టుకుని, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మలమడుగు : ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంగన్వాడీలకు మాయమాటలు చెప్పి తడి గుడ్డతో గొంతు కోశాడని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మలమడుగు పట్టణంలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నెత్తిపై తెల్ల వస్త్రాలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 33 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం అన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ బాధ్యులు వినరు కుమార్‌, కులాయమ్మ, నరసమ్మ పాలొ ్గన్నారు. పోరుమామిళ్ల : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో 33వ రోజున సమ్మె నిర్వహించారు. అంద్కేర్‌ సర్కిల్‌ వద్ద సజ్జల, బొత్స, జగన్‌ మోహన్‌ రెడ్డి వేషాలతో మాస్కులు ధరించి నిరసన తెలియజేశారు. చర్చలకు పిలిపించి జీతాలు పెంచకుండా వట్టి చేతులతో పంపుతావా అంటూ వేప మండలతో కొడుతూ నినాదాలు చేశారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. భైరవప్రసాద్‌, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుర్రా చెన్నయ్య, మండల కార్యదర్శి ఈశ్వరయ్య, అంగన్వాడీ మండలకార్యదర్శి జ్యోతమ్మ సంయుక్తంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రవి, మండలనాయకులు జ్యోతిమ్మ, రేణక, స్వాతి, విషయమ్మ, వాణి, స్వాతి, వాణి, ఫాతిమా, సుధా, రమాదేవి, మూడు మండలాల అంగన్వాడీలు 200 మంది పాల్గొన్నారు మైదుకూరు : అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం మైదుకూరు పట్టణంలోని స్థానిక సిడిపిఒ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు సాష్టాంగ నమస్కారంతో ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. కడప : అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చర్చలకు పిలిచి సజ్జల రామకష్ణారెడ్డి బెదిరింపులకు దిగడం ఏమిటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ మండిపడ్డారు. శనివారం నాటికి అంగన్వాడీల సమ్మె 33వ రోజుకు చేరుకుంది. కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బి. మనోహర్‌ మాట్లాడుతూ గత ముప్పై మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఐదు సార్లు చర్చలకు నాయకత్వాన్ని పిలిచి ‘వేతనాలు పెంచం, మీరు డ్యూటీలో జాయిన్‌ కావాలి, లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకో వాల్సి వస్తుంది’ అని సజ్జల రామకష్ణారెడ్డి బెదిరింపు ధోరణి సరికాదన్నారు. అంగన్వాడీ పోరాటానికే యుటి ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజా, డివైఎఫ్‌ఐ నగర కార్య దర్శి డిఎం ఓబులేసు సంఘీభావం తెలిపారు. కార్యక్ర మంలో సిఐటియు నగర అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు పి చంద్రారెడ్డి, పి వెంకటసుబ్బయ్య అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా,నగర ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, ఎంపీ అంజనీ దేవి నాయకురాలు దీప సావిత్రి, అంగన్వాడీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక బద్వేలు సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరి ంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) బద్వేల్‌ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 33వ రోజు శనివారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా చర్చల పేరుతో అవమానానికి గురి చేయడాన్ని నిరసిస్తూ పంగనామాలతో నిరసన చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె. నాగేం ద్రబాబు మాట్లాడుతూ చర్చల పేరుతో అంగన్వాడీలను అవమానించడం తగదని, అంగన్వాడీల సమ్మెకు లబ్ధి దారులు, ప్రజలు, సంఘాలు, రాజకీయ పక్షాల మద్దతు ఉందని, సమ్మె భవిష్యత్తులో మరింత ఉదతం అవుతుందని చెప్పారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు అంగీకరించి,నిర్బంధ చర్యలు విడనాడి ముఖ్యమంత్రి గారి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, పట్టణ కో కన్వీనర్‌ పి.సి కొండయ్య, పట్టణ నాయకులు రాజగోపాల్‌, సగిలి రాయప్ప, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, ఉపాధ్యక్షులు షేక్‌ ఆదిల్‌, వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు పొదిలి కదిరయ్య, యూనియన్‌ గౌరవాధ్యక్షులు సుభాషిని, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఆర్‌ హుస్సేనమ్మ, నాయకురాలు జయప్రద, రాధమ్మ,సత్యవతి, విజయమ్మ, కళావతి, ఉమాదేవి, మహాలక్ష్మి, తులసమ్మ, కష్ణవేణి, ప్రవీణ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : ఎస్మాచట్టం తీసుకొచ్చి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం తగదని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 33రోజులుగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా శివాలయం సర్కిల్‌ వరకు చేరుకొని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మను పాదరక్షలతో సత్కరించారు. ఇప్పటికైనా ఎస్మాచట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు మద్దతుగా అందోళనలు కొనసాగి స్తామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలకిë పద్మ విజయ సువార్తమ్మ మద్దతుగా వ్యవసాయకార్మిక సంఘ జిల్లా కార్యదర్శి అన్వేష్‌ సిఐటియు పట్టణ కార్యదర్వి విజయకుమార్‌ మహిళాసంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్‌ పాల్గొన్నారు.

➡️