పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ

మాట్లాడుతున్న ఎంపిపి కిలపర్తి రాజేశ్వరి

ప్రజాశక్తి-దేవరాపల్లి

పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై గ్రామపంచాయతీ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొని పంచాయితీ అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడారు. అనంతరం ఎంపీడీవో సిహెచ్‌ సుబ్బలక్ష్మి, తహశీల్దార్‌ యం.లక్ష్మి, ఎంపీడీవో పరిపాలన అధికారి జివి.రమణ, ఇంచార్జ్‌ ఈఓపిఆర్‌డి జి.సంతోషి నళిని పంచాయతీ అభివద్ధి ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️