రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: రైతు సంఘం

మిర్చి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్న రైతులు (ఫైల్‌)

పల్నాడు జిల్లా: వర్షాభావ పరిస్థితుల మూలంగా మిర్చి, మొక్కజొన్న, పత్తి, వరి తదితర పంటలు వేసి నీరు వర్షాలు లేక పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాల రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కోటప్పకొండ రోడ్డులోని ప్రజా సంఘాల కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ మాన వాళికి ఆహారాన్ని అందించే రైతుల పరి స్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోందని రైతాంగ స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవా ల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా వ్యవసాయ రం గాన్ని కార్పొరేటీికరణ చేసేందుకు కుట్రలు పన్నడం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు గంగిరెద్దులా తల ఊపడం సరికాదన్నారు. రోజురోజుకీ జనాభా పెర గడం ఆహార భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. రైతులు బలోపేతం అయితేనే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుం దన్నారు. గత ఖరీఫ్‌లో ఆరుతడి పంట లకు నీరు ఇస్తామని ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రకటనతో ఆయా పంటలు సాగు చేసిన రైతులు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌తో ట్యాంకర్ల ద్వారా అందుబాటులో ఉన్న అరకొర నీటి వన రులు ఒడిసి పట్టి మిర్చి పంటను సాగు చేస్తే తామర, బొబ్బర తెగుళ్లు పట్టి రైతు లను నిరాశ పరిచాయన్నారు. మిచాంగ్‌ తుఫాను నేపథ్యంలో రైతులు సాగు చేసిన అపరాల పంటలు దెబ్బతిన్నాయని, 2023-24 ఏడాది రైతులకు ఏ మాత్రం కలిసి రాలేదని, నిబంధనలు పక్కన బెట్టి నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం శనగ, మొక్కజొన్న నూర్పి డికి వచ్చిన నేపథ్యంలో మార్కెట్‌ యార్డ్‌ కమిటీల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర వర్షా భావ పరి స్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి వినుకొండ, బొల్లాపల్లి, దుర్గి, కారంపూడి తదితర ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో నీళ్లు రాక సాగు చేసిన పంటలు ఎండిపోయా యని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ ఆయ కట్టు కింద రైతులు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు బావులు ఏర్పాటు చేసినా నీళ్లు రాక వేసిన పంటలు ఎండి పోయాయని, పల్నాడు జిల్లాలో 1.70 లక్షల ఎకరాలలో మిర్చి చేసి నష్ట పోయారని తెలిపారు. రైతులు ఎకరా మిర్చికి రూ 1.50 లక్షల నుండి రూ 2 లక్షలు, మొక్కజొన్నకు రూ.35 నుండి రూ .40 వేలు, శనగకు రూ.15 వేలు నుండి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారని, పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోవడంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా తీరే పరిస్థితి లేక పోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు.. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అంచనా వేసి తక్షణ సాయంగా ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, కరువు మండలాలను ప్రకటించి, సహా యక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి పంట అమ్మకం (సీడ్‌ టూ సేల్‌) అనే రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన కేవలం ప్రకటనకే పరిమితమైందని తెలిపారు. ప్రస్తుతం శనగ,మొక్కజొన్న నూర్పిడికి వచ్చిన నేప థ్యంలో మార్కెట్‌ యార్డ్‌ ల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నాటికైనా రైతు భరోసా కేం దాల ద్వారా రైతులకు కావాల్సిన నాణ్య మైన విత్తనాలు,ఎరువులు,పురుగు మం దులు రాయితీపై అందించాలని, నకిలీ విత్తనాలు, పురుగు మందుల నివారణకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

➡️