పండుగ మీకు… పస్తులు మాకా.!

Dec 25,2023 22:56
జగనన్న పండుగ

ప్రజాశక్తి – యంత్రాంగం

‘జగనన్న పండుగ నీకు..పస్తులు మాకా..’ అంటూ అంగన్‌వాడీలు ప్లే కార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. గత 14 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీలు క్రిస్మస్‌ పండుగ రోజున కూడా పోరాట స్ఫూర్తితో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించి న్యాయం చేయాలని అంగన్‌ వాడీలు కోరారు.

కాకినాడ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా చేపట్టిన నిరసన శిబిరం వద్ద రిలే నిరహారదీక్షను అంగన ్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రావతి ప్రారంభించి మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పండగ రోజున కూడా అంగన్‌వాడీలను రోడ్లు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటే మన రాష్ట్రంలో మాత్రం అంగన్‌వాడీలు కుటుంబానికి దూరంగా రోడ్డున పడి నిరసన వ్యక్తం చేయాల్సిన దుస్థితికి జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తమ న్యాయమైన కోర్కెలను తీర్చడంలో జగన్మోహన్‌ రెడ్డికి ఏసుక్రీస్తు మంచి బుద్ధులు కలగజేయాలని కోరారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నగేష్‌, చక్రవర్తి, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌ వర్మ, లాయర్స్‌ యూనియన్‌ ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కరాచార్యులు, జ్యోతి, దుర్గమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి జి.రమణమ్మ, జ్యోతి, రామ, విజయ తదితరులు పాల్గొన్నారు.

కాజులూరు స్థానిక పంచాయితీ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. గత 14 రోజులుగా ప్రజాస్వామ్యయుతంగా అంగన్‌వాడీలు పోరాటాన్ని సాగిస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీలను భయబ్రాంతులకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతులు సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు, అంగన్‌వాడీలు వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం, కాదా సుజాత, రాయుడు సీత, సలాది లక్ష్మి జొన్నలగడ్డ సరోజిని, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్లో జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె శిబిరం సమీపంలో ఉన్న మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం వద్ద ప్లే కార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. యూనియన్‌ కార్యదర్శి దాడి బేబీ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి అంగన్‌వాడీలను పండగ రోజున నడిరోడ్డుపై నిలబెట్టారని విమర్శంచారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాగమణి, అమల, పద్మావతి, కె.దేవి, జె.సూర్యకుమారి, జ్యోతి, లోవతల్లి, వసంత కుమారి, వెంకటలక్ష్మి, నాగమణి, సావిత్రి, రత్నం, లక్ష్మి, లోవకుమారి, మహాలక్ష్మి, మంగాలక్ష్మి, రజని, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

కిర్లంపూడి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ సమీపంలో జరుగుతున్న అంగన్‌వాడీల రిలే నిరహారదీక్ష కొనసా గింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చేంత వరకూ సమ్మెను విరమించేది లేదని అంగన్‌ వాడీలు హెచ్చ రించారు. ఈ కార్య క్రమంలో పి.సావిత్రి, షేక్‌ పరివిన్‌, జి.రత్నం, పి. మంగాయమ్మ, పి.ప్ర భావతి, హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

జగ్గంపేట రూరల్‌ స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన దీక్షలో జగనన్న పండుగ నీకు…పస్తులు మాకా అంటూ ప్లే కార్డులు ప్రదర్శించి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్నం, సుజాత, చంటి, తదితరులు నాయకత్వం వహించారు.

పిఠాపురం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.విశ్వనాథం, కుంచే చిన్న, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ టి.ఉదరు శ్రీనివాసులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, పండుగ రోజున కడా పస్తుల్లో ఉంచడం బాధాకరమని అన్నారు. అంగన్‌వాడీల సమ్మె విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు తులసి, నళిని, అమల, భవాని, తదితరులు పాల్గొన్నారు.

కరప అంగన్‌వాడీలు చేపట్టిన నిరసన శిబిరంలో క్రిస్మస్‌ వేడుకను నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ శిబిరాన్ని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్‌వి.రమణ, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు మాట్లాడారు. 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటి వరకూ శాంతియుతంగా సమ్మె చేశామని, 27వ తేదీ నుంచి ఎంపిలు, ఎంఎల్‌ఎలు, మంత్రులకు సామూహిక రాయబారాలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనవరి నెలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అంగన్‌వాడీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.వీరవేణి, ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవకుమారి, అచ్చారత్నం, కల్పలత, సత్యామాధవి. ఎం భవాని, నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

పెదపూడి స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్ద క్రిస్మస్‌ వేడుకను నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు మిరియాల రాజేశ్వరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జి.సత్యవతి, ఎస్‌.కనకదుర్గ, వి.భారతి, బాంధవి, ఎస్‌ చాందిని, ఎ.శాంతరత్నం, మేరీరత్నం, నాగేంద్రమణి, బి.అరుణ, తదితరులు పాల్గొన్నారు.

కోటనందూరు తుని పట్టణంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీల సమ్మె శిబిరంలో క్రిస్మస్‌ వేడుక నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐయుటి నాయకురాలు ఎస్‌కె.పద్మ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంఓ సిఐటియు నాయకులు ఎన్‌.శ్రీనివాస్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు బి.మేరీసమాధానం, రవణమ్మ, లోవరత్నం, సుబ్బలక్ష్మి, శాంతకుమారి, సత్యవేణి, పద్మ, లీల, శ్రీదేవి, ఇందిర, సుజాత తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవు అంగన్‌వాడీల ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుప్పి అదృష్టదీపుడు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️