పంపింగ్‌ హౌస్‌ పరిశీలన

Jan 20,2024 21:12
ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న నెల్లూరు నగర మేయర్‌ స్రవంతి

ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న నెల్లూరు నగర మేయర్‌ స్రవంతి
పంపింగ్‌ హౌస్‌ పరిశీలన
ప్రజాశక్తి-సంగం : సంగం బ్యారేజీ వద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన వాటర్‌ పంపింగ్‌ హౌస్‌ను నెల్లూరు నగర మేయర్‌ స్రవంతి జయవర్థన్‌, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసులు యాదవ్‌, విజయలక్ష్మీ సందర్శించారు. పంపింగ్‌ హౌస్‌లో వాటర్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాగ్‌బుక్‌ మెయింటినెన్స్‌, మోటార్ల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పంపింగ్‌ హౌస్‌లో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నెల్లూరు నగరపాలక సంస్థలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రతలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో నెల్లూరు ప్రజలకు తాగునీటి సమస్య రానివ్వమని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరు ఎంపి, రూరల్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️