పది రోజులైనా… పట్టదా?

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పది రోజులుగా సమ్మె చేస్తుంటే పాలకులకు కనీసం చీమకుట్టినట్టయినా లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, ప్రాజెక్టు లీడర్స్‌ మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా నిరసన శిబిరాన్ని నిర్వహిస్తున్న అంగన్వాడీలు పదో రోజు సమ్మెలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట మానవహారం నిర్వహించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బొత్స లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమేష్‌, ఎఐసిసిటియు రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, పట్టణ నాయకులు సంగం, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు టి.రాజేశ్వరి, బి.నీలవేణి, పార్వతి, ధర్మావతి, కె.రాజేశ్వరి, ఎం.గౌరి, బి.శాంతి, బి.సునీత, కల్పన, జయలక్ష్మి, జ్యోతి, అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.సాలూరు :అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పట్టణ, మండల నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు బోసుబొమ్మ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. డిమాండ్లు ఆమోదించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : సమ్మెలో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో అంగన్వాడీలు ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, కోశాధికారి మండంగి రమణ ఉన్నారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్‌వాడీలో చేపడుతున్న నిరవధిక సమ్మెకు సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా జీతం చెల్లిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఆహామీని తుంగలో తొక్కడం దారుణమన్నారు.అనంతరం అంగన్వాడీలు మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం సభ్యులు వి.రామలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ నాయకులు సత్యవతి, యశోద, సునీత, శైలజ, రెడ్డి లక్ష్మి తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.కొమరాడ : అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట జ్యోతి అన్నారు. సమ్మెలో బాగంగా స్థానిక మెయిన్‌ రోడ్డు వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, సెక్టార్‌ లీడర్‌ బి.అలివేలు, జ్యోతి, పద్మ, మల్లేశ్వరమ్మ, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల నుంచి అంగన్‌వాడీలు పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ముఖద్వారం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధి సమ్మె గురువారానికి పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు, మండల కార్యదర్శి ఎం.కాంతారావు, అంగన్వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమ్మి మాట్లాడారు. కార్యక్రమంలో అంజలి, అరుణ కుమారి, ఈశ్వరి, తిక్కమ్మ, గౌతమి, ఆదమ్మ, ప్రియా, సిఐటియు మండల అధ్యక్షులు పి.సాంబయ్య, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.కురుపాం : స్థానిక ధూళికేశ్వరాలయం సమీపాన పధాన రహదారి వద్ద అంగన్వాడీలు మానవహరం నిర్వహించారు. కార్యక్రమంలో కురుపాం, జియ్యమ్మవలస మండలాల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పాచిపెంట : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు తలపెట్టిన సమ్మె పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ నాయకులు టి.ప్రభావతి, పైడ్రాజు, రమణమ్మ, సాయి, పూజ, రమాదేవి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మంచాల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. సుర్రు రామారావు, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.బలిజిపేట : స్థానిక బస్టాండ్‌ ప్రాంగణంలో అంగన్వాడీలు మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వంజరాపు సత్యంనాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు కె.దాలమ్మ, అరుణ, సావిత్రమ్మ, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.గరుగుబిల్లి: సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేపట్టిన సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ, మండలంలోని అంగన్వాడీలు,హెల్ప ర్‌ లు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.పాలకొండ : స్థానిక కోటదుర్గ గుడి సెంటర్‌లో అంగన్వాడీలు మానవహరం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు అంగన్వాడిల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌. హిమప్రభ, పాలకొండ ప్రాజెక్టు అధ్యక్షులు జి జెస్సి బారు, కె.లలిత, టి.భారతి, కె.సీతమ్మ, జి.శారద, ఆర్‌.జయలక్ష్మి, కె.ప్రమీల, కె.కళావతి తదితరులు పాల్గొన్నారు.

➡️