పభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు : ఎంఇఒ

ప్రజాశక్తి – చక్రాయపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నాడు-నేడు పథకాలతోపాటు పాలకుల సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలతో ప్రయివేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్నాయని విద్యాశాఖ అధికారి-2 రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగలగట్టుపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలలో కడప ఎంపీ వెఎస్‌ అవినాష్‌రెడ్డి సొంత నిధులతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 350 మందికి నీరు తాగడానికి స్టీల్‌ వాటర్‌ బాటిళ్లను మండల సమన్వయకర్త ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో వితరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి బాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు సంజీవ్‌కుమార్‌ స్థానిక సర్పంచ్‌ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️