పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా క్రైసిస్‌ గ్రూప్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల లోపలే కాకుండా పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని మరింత భద్రతా చర్యలు చేపట్టా లన్నారు. ఆన్‌ సైట్‌ కాకుండా ఆఫ్‌ సైట్‌లో అలారం సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలో పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రత చర్యలను పర్య వేక్షించాల్సిన అవసరం ఉందనన్నారు. రెడ్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో తగిన రక్షణ, భద్రతఎమర్జెన్సీ కల్పించేందుకు, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ చర్యలను ఖచ్చితంగా పాటించాలన్నారు. చిన్న పాటి నిర్లక్ష్యం కూడ పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ఆయా కంపెనీల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, ఫైర్‌ శాఖల అధికారులు సమన్వయంతో తరచుగా మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మి కుల్లో, ప్రజల్లో ఫ్యాక్టరీలలో ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో చేప ట్టాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన పెంపొందించాలన్నారు. 15 రోజులకు ఒకసారి పరిశ్రమల్లో తనిఖీలను చేసి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎఎస్‌పి తుషార్‌ డూడి, డిఆర్‌ఒ గంగా ధర్‌ గౌడ్‌, ఫాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్స్పెక్టర్‌ కృష్ణమూర్తి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, పిసిబి, విద్యుత్‌, ఆర్‌టిపిపి, ఫైర్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️