పరీక్ష సామగ్రి అందజేత

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : మండల పరిధిలోని దొడ్డిచింతల, ముప్పలపాడు, కూటగుళ్ల, హనుమంతునిపాడు, మహమందాపురం గ్రామాల్లోని హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆర్థిక సహకారంతో పరీక్ష సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, దొడ్డిచింతల సర్పంచి సొనికొమ్ము బ్రహ్మారెడ్డి, తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గాయం రామిరెడ్డి, కందుల వెంకట సుబ్బారెడ్డి, కోటపాటి శేషయ్య, చీకటి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పామూరు : ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థులను ఆదుకొనేందుకు దాతల ముందుకు రావడం అభినంద నీయమని ఎస్‌ఐ సైదుబాబు తెలిపారు. పామూరు ప్రభుత్వ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వైసిపి నాయకులు ఇర్రి కష్ణారెడ్డి ఆర్థిక సాయంతో పరీక్షా సామగ్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ యాదాల వెంకట సాయి, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ చాంద్‌ బాషా, నారాయణ, ఏడు కొండలు పాల్గొన్నార.

➡️