చెరువుని తలపిస్తున్న మార్కెట్‌ రోడ్డు

Jun 28,2024 21:52

సీతానగరం: వర్షం పడితే చాలు స్థానిక మార్కెట్‌ రోడ్డు చెరువును తలపిస్తుంది. దీంతో వ్యాపారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. ఈరోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా కొత్త ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️