పర్యావరణ పరిరక్షణపై అవగాహన

ఎన్‌జిసి రాష్ట్ర డైరెక్టర్‌కు మొక్క అందజేస్తున్న అధికారులు

ప్రజాశక్తి – ముమ్మిడివరం

విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని నేషనల్‌ గ్రీన్‌ కార్ప్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పి.స్రవంతి ఐఎఎస్‌ సూచించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని భాష్యం, రవీంద్ర మరియు బాలాజీ వంటి కార్పొరేట్‌,ప్రైవేట్‌ పాఠశాలలు ఏర్పాటు చేసిన పర్యావరణం పై అవగాహన సదస్సులకు స్రవంతి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆమె వెంట జిల్లా గ్రీన్‌ కార్ప్‌ సభ్యురాలు జి ప్రభావతి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎడి సురేష్‌, మండల విద్యాశాఖాధికారి బి.రమణ శ్రీ, ఉదయ భాస్కర్‌లు, సిఎంఒ సుబ్రహ్మణ్యంతదితరులు పాల్గొన్నారు.

 

 

➡️