పలుచోట్ల నూతన భవనాలు ప్రారంభం

Mar 15,2024 21:06

 ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని మండ, దేవనాపురం, పెదరామ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో ఉండే ప్రభుత్వ శాఖల సిబ్బంది అంతా గ్రామస్థాయిలో ఉండి, ప్రభుత్వ పరిపాలన క్షేత్రస్థాయికి తీసుకొచ్చి, సేవలను ప్రజల గడప వద్దకే అందించేందు సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందన్నారు. పరిపాలన, సంక్షేమం, విద్య , వైద్య ,వ్యవసాయ రంగాలను పరిపుష్టి చేసి పేదలందరికీ అండగా నిలిచిన యువ ముఖ్యమంత్రి జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జెడ్‌పిటిసి ప్రతినిధి సవర రాము, ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహన్‌రావు, వైస్‌ ఎంపిపిలు, జెసిఎస్‌ కో – ఆర్డినేటర్‌, స్థానిక సర్పంచ్‌లు, స్థానిక ఎంపిటిసిలు, సర్పంచులు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.కృష్ణరాయపురంలో బిటి రోడ్డు ప్రారంభంసీతానగరం : మండలంలోని కృష్ణరాయపురంలో ఎమ్మెల్యే ఎ.జోగారావు బిటి రోడ్డును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామానికి ఇచ్చిన హామీలో భాగంగా రూ.40 లక్షలతో బిటి రోడ్డు పనులు పూర్తి చేయడం ప్రజలకు అంకితం చేశారు. అంతేకాక తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానని రాబోయే ఎన్నికల్లో తనకు గ్రామం అంతా ఐక్యంగా ఉండే తనను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో గెలుపొందితే మరో మూడు రోడ్లు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బి.రమణమ్మ, జెడ్‌పిటిసి ఎం.బాబ్జీ, సర్పంచ్‌ గుణుపూరు అన్నంనాయుడు, వైసిపి మండల అధ్యక్షులు బి.చిట్టిరాజు, మాజీ సిడిసి ఎన్‌.రామకృష్ణ, గ్రామ మాజీ సర్పంచ్‌ రెడ్డి అప్పలనాయుడు పాల బలరామనాయుడు వైసీపీ నాయకులు ఆర్‌ వి పార్థ పార్థసారథి వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

➡️