పలుచోట్ల పూర్వ విద్యార్థుల సందడి

పలుచోట్ల పూర్వ విద్యార్థుల సందడి

ప్రజాశక్తి-యంత్రాంగం పలు పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు కలుసుకుని బుధవారం సందడి చేశారు. ఉప్పలగుప్తం గొల్లవిల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో 1995- 96 పదో తరగతి విద్యార్థులు ఆ పాఠశాలలో కలుసుకున్నారు. 27 ఏళ్ల తరువాత పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మోటూరి సుబ్రహ్మణ్యం, అంబటి సత్యనారాయణ, రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్‌, ఆకుల నాగేశ్వరరావు, యాగ ఏడుకొండలు, సలాది వెంకటేశ్వరరావు, కొమ్ముల సూర్యనారాయణ, రంకిరెడ్డి రంగమణి, మెండి సత్తిరాజు, ఎం.మల్లయ్య శర్మ, మేడిద వేణుగోపాలరావు, నిమ్మకాయల నాయుడును ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు చీకట్ల వెంకన్న నాయుడు, గనిశెట్టి సీతామహాలక్ష్మి, చిక్కం భీముడు, నిమ్మకాయల కన్నా, మద్దింశెట్టి సురేష్‌, ఆకుల సూర్యనారాయణ మూర్తి, కాట్రు రాజన్‌ నాగేంద్ర, చిక్కం భీమేష్‌, మోటూరి మాధురి, మన్నె సూర్యచంద్రరావు పాల్గొన్నారు. కొత్తపేట జిల్లా పరిషత్‌ హస్కూల్లో 2002 నుంచి 2007 వరకూ చదువుకున్న పూర్వ విద్యార్థినులు హైస్కూల్‌లో కలుసుకున్నారు. కాట్రేనికోన కుప్ప కళా వెంకటరావు జెడ్‌పి హైస్కూల్లో 1986-87 10వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. హెచ్‌ఎం కె.భారతి, గుదే వెంకటేశ్వరరావు, పూర్వ ఉపాధ్యాయులు తాడి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు వడ్డి శ్రీనివాసరావు, కెవివి.సత్యనారాయణ, కె.శంకర్రావు, పరం కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై సురేష్‌ కుమార్‌, జి.వెంకటేశ్వరరావు, విఆర్‌ఒ ఎస్‌వి.రమణ, కెఎస్‌.రావు, కెవి.రమణ, జి.శ్రీను, గంపల సూర్యప్రకాశరావు, గుదే వెంకటేశ్వరరావు, కందికట్ల శంకరరావు, యడ్ల సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️