పల్స్‌ పోలియో నిర్వహణపై శిక్షణ

Feb 24,2024 21:29
ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఈశ్వరమ్మ

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఈశ్వరమ్మ
పల్స్‌ పోలియో నిర్వహణపై శిక్షణ
ప్రజాశక్తి-ఉదయగిరి : పల్స్‌ పోలియోపై ఉపాధ్యాయులకు గండిపాలెం పిహెచ్‌సి వైద్య అధికారిని శివకల్పన శిక్షణ ఇచ్చారు. శనివారం స్థానిక స్త్రీశక్తి భవన్‌లో ఉపాధ్యాయులకు పల్స్‌ పోలియో కార్యక్రమంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మండల అధికారులు మాట్లాడుతూ మార్చి 3, 4, 5వ తేదీల్లో జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పల్స్‌ పోలియోపై ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ డి.ఈశ్వరమ్మ, ఎంఇఒలు షేక్‌ మస్తాన్‌ వలీ, తోట శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️