పారిశుధ్య మహిళా కార్మికులకు సత్కారం

Mar 8,2024 19:59

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి స్వగహంలో మహిళా పారిశుధ్య కార్మికులకు సత్కరించారు. డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య కార్మికులకు శాలువులతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మేయరు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, ఎఎంసి చైర్మన్‌ శశిభార్గవి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పరిరక్షణలో మహిళా కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. ప్రతిరోజు నగరంలో చెత్తాచెదారాలను సేకరిస్తూ పరిశుభ్ర వాతావరణన్ని నెలకొల్పతున్నారన్నారు. అటువంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు తెలపినట్లు చెప్పారు. కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️