పిఎఫ్‌ సొమ్ము జమ చేయాలి : సిఐటియు

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ మున్సిపల్‌ కార్మికుల పిఎఫ్‌ సొమ్ము మొత్తం వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎ.రామాంజులు పేర్కొన్నారు. గురువారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో యం చెన్నయ్య అధ్యక్షతన మున్సిపల్‌ యూనియన్‌ పట్టణ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ కార్మికులు నిత్యం శ్రమించి తన జీతంలో కొంత సొమ్మును భవిష్య నిధి ా భద్రపరచు కుంటే పిఎఫ్‌ ఖాతాకు జమ చేయకుండా వారి సొమ్మును ప్రభుత్వం స్వాహా చేయడానికి అధికారులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి అధికారులను సస్పెండ్‌ చేయాలనీ డిమాండ్‌ చేశారు. 2014 నుంచి నేటి వరకు 3 ఖాతాలుగా పిఎఫ్‌ను విభజించి దోచుకున్నారని ఆరోపించారు. గత కలెక్టర్‌ చర్యలతో ఒక ఖాతాగా సరిచేసినట్టే చేసి తప్పుకున్నారని విమర్శించారు. పిఎఫ్‌ సొమ్ము మీద ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేనందున వచ్చే ఎన్నికల్లో పాలకులకు గట్టి బుద్ది చెబుతామని మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్షులు యం. చెన్నయ్య తెలిపారు. కార్యక్రమంలో అగ్గరామయ్య, శంకరయ్య, తిరుపాల్‌, మంగమ్మ ,తిరపతమ్మ, సుభాషిణి, ఉమా మహేశ్వరీ, రమణమ్మ, సురేష్‌, సిద్దయ్య, చిన్న వెంకటరమణ పాల్గొన్నారు.

➡️