పూనకాలతో హోరెత్తించిన అంగన్వాడీలు

Dec 29,2023 20:40

 ప్రజాశక్తి-భోగాపురం :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా శుక్రవారం భోగాపురంలో అమ్మవారి పూనకాలతో హోరెత్తించారు. వినూత్నరీతిలో వేప, మామిడి కొమ్మలతో అమ్మవారికి పూజలు చేస్తూ ప్రభుత్వానికి మంచిబుద్ధి ప్రసాదించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కృష్ణవేణి, కొర్లమ్మ, అనిత, శ్రీదేవి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

➡️