పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి

Dec 7,2023 22:12
నార్త్‌ జోన్‌ ఇన్‌ఛార్జ్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రాజానగరం నియోజకవర్గం లోని ఆయా పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో గోకవరం, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల పిఎస్‌లకు సంబంధించిన సిఐ, ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా కాలం నుంచి దర్యాప్తు చేయకుండా పెండింగ్లో ఉన్న కేసులపై ఆయన ఆరా తీశారు. జెకెసిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసుల కోర్ట్‌లో స్పీడ్‌ ట్రయిల్‌ మానిటరింగ్‌ ద్వారా షీట్స్‌లోని నిందితులకు తగిన శిక్షపడేలా కృషి చేయాలని, ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకుని రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యక్రమాలను కట్టడి చేయాలని, సారా, గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని, దర్యాప్తు పూర్తి అయిన కేసుల్లో ఛార్జ్‌షీట్లు వేయడంలో ఆలస్యం లేకుండా ఫైల్‌ చేసి కోర్టులో విచారణ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీట్‌ కలిగిన వ్యక్తి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రాబోయే ఎలక్షన్స్‌ దృష్టిలో ఉంచుకుని ముందస్తు సమాచారం సేకరించాలని ఆదేశించారు. సెన్సిటివ్‌ మరియు హైపర్‌ సెన్సిటివ్‌ ఏరియాలను గుర్తించి ఆ ఏరియాలో గల ట్రబుల్‌ మాంగర్స్‌ను గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నార్త్‌ జోన్‌ ఇన్‌ఛార్జ్‌ డిఎస్‌పి ఎం.కిషోర్‌ కుమార్‌, సిఐ జి. ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐలు కాశీ విశ్వనాథం, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️