పేదలకు అసరాగా వైసిపి ప్రభుత్వం

వైసిపి ప్రభుత్వం

ప్రజాశక్తి-కాజులూరు పేదలకు ఆసరాగా ఉండటమే సిఎం వైఎస్‌.జగన్‌ లక్ష్యమని బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం మండలంలోని 14 గ్రామాలకు సంబంధించి 243 మంది రైతులకు డి.ఫారం పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో పేద రైతంగాన్ని ఆదుకునే విధంగా పట్టా భూముల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పేద రైతులకు భూమి ఉంటే ఆత్మస్థైర్యం కలుగుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న యువత ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు. జీవనోపాధి పెంపొందించుకునే యువతకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయం కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు వనుం వెంకట సుబ్బారావు, ఎంపిపి మాత భారతి మురళి, గుబ్బల యేసు రాజు, సర్పంచ్‌ దండంగి సరోజినీ చిన్నారావు, తహశీల్దారు సత్యనారాయణ, ఆర్‌ఐ వేగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️