వైభవంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం, పేర్నమిట్ట, సమతానగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో గురువారం లక్ష్మీపద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి 13వ వార్షికోత్సవంలో భాగంగా వైభవంగా కళ్యాణ మహౌత్సవ వేడుకలు నిర్వహించారు. వేద పండితులు పరాంకుశం కేశవా చార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పర్చూరి పార్థసారథి శ్రీనివాసన్‌ తదితరులుచే ఘనంగా లక్ష్మీపద్మావతి సమేత శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. ప్రతి ఏడాదీ ఆలయ కమిటీ వైభవంగా వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. ఆలయ కమిటీ పర్యవేక్షణలో దాతల సహకారంతో వేలాది మందికి అన్నదానం చేశారు. ఈ కళ్యాణ వేడుకలకు సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్‌.విజరుకుమార్‌ విచ్చేశారు. ఆ అర్చకులు పర్చూరు పార్థసారథి శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజరుకుమార్‌కు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే విజరుకుమార్‌ను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆర్‌ఎస్‌ నాయుడు, కొట్టే వెంకటేశ్వర్లు, రాయిని కష్ణమూర్తి, చలపతిరావు, సుధాకర్‌, రాములు సత్కరించారు. భక్తుల అధిక సంఖ్యలో కళ్యాణ మహౌత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

➡️