పేదలకు బియ్యం పంపిణీ

Mar 2,2024 20:29

ప్రజాశక్తి-విజయనగరం కోట :  పేదలకు తమ సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని కెఆర్‌ హెల్పింగ్‌ హాండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బి. కాంతారావు అన్నారు. శనివారం స్థానిక అద్దేపల్లి వారి వీధిలో యాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుంప అప్పలరాజు ఆధ్వర్యంలో పేదలకు బియ్యం ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈనెల 8 శివరాత్రి వరకు ఏదో ఒక డివిజన్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని కాంతారావు తెలిపారపు. బిసి సంక్షేమ సంఘం నాయకులు ముద్దాడ మధు మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే ధృక్పథంతో కాంతారావు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జానకీ రాం, ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️