పేదలకు వస్త్రదానం

Dec 11,2023 21:19

ప్రజాశక్తి – జామి :  జామిలోని బసవేశ్వర ఆలయంలో బసవేశ్వర స్వామి గనారాధన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పేదలకు భారీ వస్త్ర, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సూర్యనారాయణ రాజు, డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, వైసిపి మండల అధ్యక్షులు గొర్లె రవి, జెడ్‌పిటిసి గొర్లె సరయు, సర్పంచ్‌ చిప్పాడ లక్ష్మి, ఉప సర్పంచ్‌ అల్లుపద్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️