పేదల సిఎం వైఎస్‌ జగన్‌

Jan 26,2024 21:58
ఫొటో : పత్రాలు అందజేస్తున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ఫొటో : పత్రాలు అందజేస్తున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
పేదల సిఎం వైఎస్‌ జగన్‌
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : పేదల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని కోవూరు ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రువారం మండలంలోని కొత్తూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో ఆరోగ్యశ్రీ కార్డులు, భూహక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి పాల్గొని పట్టాలను, ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్‌ రెడ్డి శాశ్వత భూహక్కు పథలను పంపిణీ చేస్తున్నారన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్‌ రెడ్డిని గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని జగన్మోహన్‌ రెడ్డిగా చూడాలన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రూ.5 లక్షలు ఉండే ఆరోగ్య శ్రీ కార్డున రూ.25లక్షలు చేసిన జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలందరూ ఎప్పుడు రుణపడి ఉండాలన్నారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రా రాష్ట్రాలలో చెల్లుతుందని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మళ్లీ జగన్మోహన్‌ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కోపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, యువనేత దువ్వూరు కళ్యాణ్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరు కుమార్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️