పేర్నాటి సుడిగాలి పర్యటన

Jan 8,2024 21:49
మార్కెట్లో ప్రచారం చేస్తున్న దృశ్యం

మార్కెట్లో ప్రచారం చేస్తున్న దృశ్యం
పేర్నాటి సుడిగాలి పర్యటన
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌: నెల్లూరు నగరంలోని ప్రధాన ఏసీ కూరగాయల మార్కెట్లో ఏఎంసీ చైర్మన్‌ పేర్నాటి కోటేశ్వర్‌ రెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. మార్కెట్లోని దుకాణాల సముదాయాలను చైర్మన్‌ పేర్నటి సందర్శించి పరిశీలించారు. అదేవిధంగా మార్కెట్‌ పరిశుభ్రతను చైర్మన్‌ పరిశీలించారు. మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా పార్క్‌ చేసి ఉన్న వాహనాలను అక్కడి నుంచి తొలగించాలని సిబ్బందిని చైర్మన్‌ పేర్నాటి ఆదేశించారు. అడ్డదిడ్డంగా ఉన్న దుకాణాలను వరుస క్రమంలో ఏర్పాటు చేశారు.

➡️