పొంగులేటిని కలిసిన ఏపిఆర్‌ అధినేత

ప్రజాశక్తి-పొదిలి: తెలంగాణ రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, హైదరాబాద్‌కు చెందిన పిఆర్‌ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ ఆవుల కృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పొంగులేటిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్‌ రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️