పొగాకు బ్యారెన్‌ దగ్ధం

Mar 27,2024 21:29
ఫొటో : బ్యారెన్‌లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ఫొటో : బ్యారెన్‌లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
పొగాకు బ్యారెన్‌ దగ్ధం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండల కేంద్రంలో సోమల వెంకటేశ్వర్లురెడ్డి, నాగేశ్వరరావులకు చెందిన పొగాకు బ్యారెన్‌ బుధవారం అగ్నికి ఆహుతయింది. బ్యారెన్‌లో పొగాకు అల్లిన 1150 కర్రను క్యూరింగ్‌ కోసం ఉంచారు. క్యూరింగ్‌ సమయంలో ప్రమాదవశాత్తు పొగాకు రాలి గొట్టం మీద పడడంతో మంటలు వ్యాపించి బ్యారన్‌ మొత్తం అగ్నికి ఆహుతయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4.50లక్షలు నష్టపోయామని రైతులు వాపోయారు. మర్రిపాడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వారు మంటలను అదుపు చేశారు.బాధితులకు నష్టపరిహాం అందించాలి..డిసిపల్లి పొగాకు బోర్డు అధికారులు అగ్నికి ఆహుతైన పొగాకు బేరం పరిశీలించి బాధితులకు నష్ట పరిహారం అందించాలని డిసిపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మూలి వెంగయ్య బోర్డు అధికారులను కోరారు. ఆయన రైతులను విచారించగా దాదాపు రూ.4.50లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరారు.

➡️