పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్‌పి

Mar 28,2024 21:33

ప్రజాశక్తి – కురుపాం/గుమ్మలక్ష్మీపురం : రానున్న సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ ఎల్విన్పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఒడిశా సరిహద్దు గ్రామాలైన లడ్డ, కొందుకుప్ప, సమస్యాత్మక గ్రామమైన చింతలపాడు పోలింగ్‌ స్టేషన్ల భవనాలను సందర్శించి వాటి స్థితి గతులు, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొని తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కురుపాం మండలంలోని ములిగూడ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. నాటుసారా, గంజాయి అక్రమ రవాణా అరికట్టే భాగంగా వాహన తనిఖీ నిర్వహిస్తూ చెక్‌పోస్ట్‌ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్‌ పేట సిఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.వాహనాలను విస్తృత తనిఖీలు చేపట్టాలి పాచిపెంట : అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ల వద్ద వాహనాలను విస్తృత తనిఖీలు చేయాలని ఐటిడిఎ పిఒ, ఆర్‌ఒ విష్ణుచరణ్‌ ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని పి.కోనవలస అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌, పద్మాపురం చెక్‌ పోస్ట్‌లను ఆయన పరిశీలించారు. చెక్‌ పోస్ట్‌ల వద్ద ఉన్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చెక్‌ పోస్ట్‌ల మీదుగా వెళ్లే వాహనాలను నిశితంగా తనిఖీలు చేయాలని ఎఫ్‌ ఎస్పి బృందం, పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్‌లో పొందుపర్చాలని సూచించారు. అనంతరం సాలూరులో నిర్మాణంలో ఉన్న ఆర్‌అండ్‌బి అతిథి గృహాన్ని పరిశీలించారు. పనులు పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. పది రోజుల్లో అందజేస్తామని ఇఇ వేణుగోపాలరావు చెప్పా రు. ఆయన వెంట ఆర్‌అండ్‌బి డిఇ సుబ్బారావు, జెఇ విజరు కుమార్‌ వున్నారు. సీతానగరం : మండలంలోని అంటిపేట వద్ద సైన్‌ స్క్వాడ్‌ వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ ఇ.చిన్నారావు మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. వాహనాల ద్వారా అక్రమంగా ఎటువంటి వాటిని తీసుకువెళ్లడానికి లేదని అలా తీసుకెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️