పోలీసులకు యూనిఫారం అందజేత

Jan 26,2024 21:52
ఫొటో : పోలీసులకు యూనిఫారం అందజేస్తున్న దృశ్యం

ఫొటో : పోలీసులకు యూనిఫారం అందజేస్తున్న దృశ్యం
పోలీసులకు యూనిఫారం అందజేత
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : విధి నిర్వహణలో విశేష సేవలందిస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆత్మకూరు ప్రాంత పోలీసులకు తమవంతు సహకారంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వింజాం దొరసానమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆత్మకూరు స్టేషన్‌ పరిధిలోని పోలీసులకు ఆత్మకూరు సిఐ జి.వేణు ద్వారా పోలీస్‌ యూనిఫారంను శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాగర్లమూడి.ప్రణీత్‌ చౌదరి అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సాయిప్రసాద్‌ పోలీస్‌ సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా తమ సిబ్బందికి యూనిఫారం అందించిన డాక్టర్‌ ప్రణీత్‌ చౌదరికి సిఐ వేణు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్‌ విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు యూనిఫాం అందించినందుకు తనకు సంతోషంగా ఉందని తెలియజేశారు.

➡️