పోస్టరు ఆవిష్కరణ

Dec 15,2023 22:08
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ
పోస్టరు ఆవిష్కరణ
ప్రజాశక్తి-కందుకూరు:శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ సాహిత్య కళ ఉత్సవాల కరపత్రాన్ని, వాల్‌పోస్టరును శుక్రవారం తన కార్యాలయంలో ఆ వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ శ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అభివద్ధికి సూచిక అని అన్నారు. ఈ నెల 16,17తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా లోని, తాడేపల్లిగూడెంలోని బుద్దాల కన్వెన్షన్‌ హాల్లో ఏక బిగిన 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల కాలంలో, నిర్విరామంగా కవితా గోస్టులు, సాహిత్య సేవ జరగడం ఎంతో అభినందనీయమన్నారు, ఈ సాహిత్య యజ్ఞంలో వెయ్యి మంది సాహితీవేత్తలు పాల్గొననుండడం తనను అబ్బురపరిచిందన్నారు. శ్రీ శ్రీ కళావేదికకు జాతీయ అధ్యక్షురాలుగా ఈశ్వరి భూషణం అత్యంత అంకితభావంతో పనిచేస్తున్నారని, ఉపాధ్యాయురాలుగా, కవయిత్రిగా రచయిత్రిగా, ఆమె బహుముఖ ప్రజ్ఞ ను ప్రదర్శిస్తుండటం ఎంతో ఆనందదాయకమన్నారు.

➡️