ప్రచారానికి అనుమతి తీసుకోవాల్సిందే

Mar 22,2024 21:47

ప్రజాశక్తి-చీపురుపల్లి  : ఇంటింటికి ప్రచారం చేసినా అనుమతి తీసు కోవాల్సిందేనని చీపురుపల్లి ఆర్‌డిఒ బి.శాంతి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల నియమావళిని తూచ తప్పకుండా పాటించాలన్నారు. పోటీలో ఉండే ఏ పార్టీ అభ్యర్థులైనా వారి సభలు, సమావేశాలు, ప్రచారాలకు సంబంధించి అనుమతులు పొందేందుకు వారం రోజుల ముందుగా సుపధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ, బ్యానర్లు, జెండాలు కట్టినా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలో 160 లొకేషన్లలో 257 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. సమావేశంలో చీపురుపల్లి తహశీల్దారు ఎన్‌.సురేష్‌, సిఐ సిహెచ్‌ షణ్ముఖరావు పాల్గొన్నారు.

➡️