మీ ఇళ్లలో ఇలాగే ఉంచుకుంటారా..?

– బాలికల జూనియర్‌ కళాశాలలో అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు
– అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
ప్రజాశక్తి-పెనుకొండ టౌన్‌ :’మీ ఇళ్లలో కూడా ఇలాగే ఉంచుకుంటారా’ బాలికల జూనియర్‌ కళాశాల అధ్యాపకులపై బిసి సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలోని బాలికల జూనియర్‌ కళాశాలను శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యాబోధన, వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించారు. అధ్వానంగా, అపరిశుభ్రంగా ఉండడంతో అధ్యాపకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు, ఉపాధ్యాయుల పని తీరుపై ఆరా తీశారు.

➡️