ప్రచారానికి శ్రీకారం

Feb 10,2024 22:03

ప్రచారానికి శ్రీకారం
దగ్గర పడుతున్న ఎన్నికలు
మారుతున్న సమీకరణలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సమీకరణలు మారుతున్నాయి. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధికార వైఎస్సార్‌సీపీ ప్రయత్నాలు చేస్తుంటే… చావురోవో తెచ్చుకొనేలా అధికార పార్టీ అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు సిద్ధం అనే నినాదంతో అధికార పార్టీ… సంసిద్ధం అంటూ సవాలు విసురుతూ ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన ఓటర్లను వశం చేసుకొనేందుకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో భారీ బహిరంగ సభలు, తెలుగుదేశం పార్టీ రా… కదలిరా.. పేరుతో జీడి నెల్లూరు మండలం రామనాయుడుపల్లిలో భారీ బహిరంగ సభతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలో కొత్త జోష్‌ నింపింది. జీడి నెల్లూరు నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ అంచనాలకు మించి జనం పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం జిల్లాలోని నగరిలో భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. షర్మిల సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు జన సమీకరణలో నిమగమయ్యరు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో కాంగ్రెస్‌ పార్టీ పునర్జీవం పోసుకొనేలా బహిరంగ సభను విజయవంతం చేసేలా జనసమీకరణ చేస్తున్నారు. అధికర వైసిపి జిల్లాలోని కుప్పం నుండీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం ఈనెల 16వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కుప్పం బహిరంగసభ ద్వారా జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటి వరకు జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలు ఖరారు కాలేదు. తెలుగుదేశంతో ఉమ్మడి బహిరంగ సభల్లో పాల్గొన్ని జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపేలా జనసేన నాయకులు హ్యాహరచన చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఐప్యాక్‌ సర్వే అనుకూలంగా లేదంటూ సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలు పూతలపట్టు ఎంఎస్‌ బాబు, చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు ఎంఎల్‌ఏ ఆదిమూలంలను పక్కన పెట్టారు. జీడి నెల్లూరు ఎంఎల్‌ఏ డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని మార్చే ప్రయత్నం చేసినా అధికార పార్టీ ఎందుకో తిరిగీ జీడి నెల్లూరు నారాయణ స్వామినే దింపాలని నిర్ణయించుకుంది. దళిత సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ మార్పుతో అప్పటి వరకు తమకే టిక్కెట్‌ దక్కుతుందని ఆశించిన ఎంఎస్‌ బాబు, ఆదిమూలం సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభ స్థానం ఇస్తామని బుజ్జగించి చివరి నిమిషంలో మాచ్చడంపై చిత్తూరు బలిజ సంఘం నేతలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార పార్టీలోని బలిజలు తిరుగుబాటు జెండా ఎగురవేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోతామంటూ బహిరంగా ప్రకటిస్తున్నారు. మరో వైపు చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవ్వరు ఏ పార్టీలోకి జంప్‌ చేస్తారు…. టికెట్లు ఎవ్వరకి దక్కుతాయనే విషయం తేలాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే…!

➡️