ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాన్ని రద్దు చేయండి

సత్తెనపల్లి రూరల్‌: ప్రజల ఆస్తులకు రక్షణ లేని భూమి యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని సత్తెనపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మారూరి లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సత్తెనపల్లి తాలూక న్యాయ స్థానం ప్రాంగణంలో ఉన్న న్యాయదేవత విగ్రహం ముందు సత్తెనపల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగు తున్న రిలే దీక్షలు శిబిరాన్ని మారూరి లింగారెడ్డి సోమవారం ప్రారం భించారు. ఈ సందర్బంగా లింగారెడ్డి మాట్లాడారు. ఈ శిబి రంలో న్యాయవాదులు కె.హరిబాబు,రాజశేఖరుని గోపాలకృష్ణ మూర్తి, వి.పాపారావు, బి.రామిరెడ్డి, బి.కోటేశ్వర రావు, యు.నయన, కె.సాయి సీనియర్‌ న్యాయవాద గుమస్తా కె. జీవ అచ్యుత రాజు కూర్చున్నారు.

➡️