ప్రజాసంక్షేమం జగనన్నతోనే సాధ్యం

Feb 6,2024 21:51
ఫొటో : రాజగోపాల్‌రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్న నాయకులు

ఫొటో : రాజగోపాల్‌రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్న నాయకులు
ప్రజాసంక్షేమం జగనన్నతోనే సాధ్యం
ప్రజాశక్తి-జలదంకి : రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని ఉదయగిరి వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జలదంకి మండలంలోని గోపన్నపాలెం గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం సమదృష్టితో పాలన సాగిస్తూ, సచివాలయ వ్యవస్థతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసిపికి ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం సర్పంచ్‌ గండు వెంకారెడ్డి అధ్యక్షతన జరిగింది. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ, ఆయా కుటుంబాలకు ఎంతమేర లబ్ధి చేకూరిందనే విషయాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకుల ఆధ్వర్యంలో మేకపాటికి ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పాలవల్లి మాలకొండారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్మోహన్‌ రెడ్డి, జిల్లా ఎస్‌సిసెల్‌ జనరల్‌ సెక్రటరీ దామెర్ల దేవదాసు, జిల్లా రైతు విభాగ జనరల్‌ సెక్రెటరీ రావిప్రసాద్‌ నాయుడు, జిల్లా ప్రచారప్రధాన కార్యదర్శి అంకినపల్లి నర్సింహారెడ్డి, జెడ్‌పిటిసి మేదరమెట్ల శివలీలమ్మ, మండల సచివాలయాల కన్వీనర్‌ తిప్పారెడ్డి ఇందిరమ్మ, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, మండల రైతు విభాగ అధ్యక్షులు గండు కృష్ణారెడ్డి, సర్పంచులు తమ్మినేని సతీష్‌బాబు, బోడిమల్ల కృష్ణారెడ్డి, వాకా గోపాల్‌ రెడ్డి, నాయకులు పసుపులేటి ప్రసాద్‌, గుమ్మిడి రమేష్‌, కాకాణి మహదేవయ్య, గుమ్మలంపాటి కళ్యాణ్‌, సుబ్బారావు, దేవరపల్లి మధుసూదన్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

➡️