ప్రజా రంజక పాలన వైసిపితోనే సాధ్యం

Jan 9,2024 21:25

ప్రజాశక్తి- రేగిడి: ప్రజా రంజక పాలన వైసిపితోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, రాజాం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి తలే రాజేష్‌ అన్నారు. మంగళవారం లక్ష్మీపురంలో గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అందుతున్న వివిధ సంక్షేమ పథకాల పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే వైసిపి ప్రభుత్వం ధ్యేయమన్నారు. పేదవాడే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దార అప్పలనరసమ్మ, వైస్‌ ఎంపిపిలు టంకాల అచ్చెం నాయుడు, వావిలపల్లి జగన్మోహన్‌రావు, ధవలేశ్వర రావు, సర్పంచ్‌ కెంబూరు తేజోవతి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి ఎర్నేన అప్పలనాయుడు, కింజరాపు సురేష్‌, కె. శ్రీనివాసరావు, ముంజేటి కిషోర్‌, పిల్లా గౌరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️